: ఫ్లోరిడాలో విధ్వంసం సృష్టించిన ఇర్మా పెను తుపాను.. 3 కోట్ల 60 ల‌క్ష‌ల మందిపై ప్రభావం


అమెరికాలోని ఫ్లోరిడా ప్ర‌జ‌లు ఇర్మా తుపాను ధాటికి అల్లాడిపోతున్నారు. గంట‌కు 210 కిలోమీట‌ర్ల వేగంతో వీచిన గాలులు విధ్వంసం సృష్టించాయి. ఇర్మా పెను తుపాను ప్ర‌భావం 3 కోట్ల 60 ల‌క్ష‌ల మందిపై ప‌డింది. 33 ల‌క్ష‌ల ఇళ్లు, వాణిజ్య స‌ముదాయాల‌కు విద్యుత్ సర‌ఫరా నిలిచిపోయింది. ప్ర‌స్తుతం ఆ తుపాను ప్ర‌భావం త‌గ్గింది. ఇప్పుడు 110 కిలోమీట‌ర్ల వేగంతో గాలులు వీస్తున్నాయ‌ని అక్క‌డి అధికారులు ప్ర‌క‌ట‌న చేశారు. తీవ్ర‌త త‌గ్గినా వ‌ర‌ద ముప్పు మాత్రం పొంచే ఉంద‌ని అక్క‌డి అధికారులు తెలిపారు. మ‌రోవైపు ఉత్త‌ర ఫ్లోరిడా, ఆర్జియాలో రానున్న రెండు రోజుల్లో కుండ‌పోత వాన‌లు కురుస్తాయ‌ని హెచ్చ‌రిక‌లు జారీ చేశారు.   

  • Loading...

More Telugu News