: కేవలం 24 గంటల్లో 70,54,000 వ్యూస్ సాధించిన ‘జై లవకుశ’ థియేట్రికల్ ట్రైలర్!
సినీనటుడు జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు బాబీ కాంబినేషన్‌లో రూపుదిద్దుకున్న ‘జై లవకుశ’ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌కి అనూహ్య స్పందన వస్తోంది. మూడు పాత్రల్లో ఎన్టీఆర్ ప్రదర్శించిన హావభావాలు ఆ ట్రైలర్‌ను మళ్లీ మళ్లీ చూసేలా చేస్తున్నాయి. ఎన్టీఆర్ హాస్యం, భావోద్వేగం, ఫైటింగులు, డ్యాన్సులు ఆయన అభిమానులను అలరిస్తున్నాయి. దీంతో ఈ ట్రైలర్ కేవలం 24 గంటల్లోనే 70,54,000 రియల్ టైమ్ డిజిటల్ వ్యూస్ సాధించిందని ‘జై లవకుశ’ సినిమాను నిర్మిస్తోన్న ఎన్టీఆర్ ఆర్ట్స్ తమ ట్విట్టర్ ఖాతా ద్వారా తెలిపింది.