: ఫేస్‌బుక్‌లో పరిచయం చేసుకుని లక్షలు కాజేస్తోన్న ముఠా అరెస్ట్!


దేశ వ్యాప్తంగా ఆర్థిక నేరాలకు పాల్పడుతున్న 10 మంది నైజీరియన్లను రాచకొండ పోలీసులు అరెస్టు చేసి మీడియా ముందు ప్రవేశపెట్టారు. వీరంతా ఫేస్‌బుక్‌తో పాటు ఇతర సోషల్ మీడియాల ద్వారా పరిచయం చేసుకొని, మాయమాటలు చెప్పి సైబర్‌ నేరాలకు పాల్పడుతున్నట్లు చెప్పారు. అందులో విలియం అనే ఓ నిందితుడు తాను లండన్‌లో చర్చి ఫాస్టర్‌నని చెప్పుకుని ఓ మ‌హిళ వ‌ద్ద డ‌బ్బు కాజేశాడ‌ని అన్నారు.

తాను 50వేల అమెరికన్‌ డాలర్లు పంపిస్తానంటూ ఆ మహిళతో చెప్పి అందుకోసం ముందుగా కొంత చెల్లించాల్సి ఉంటుంద‌ని నమ్మించి, 9.37లక్షల మొత్తాన్ని వసూలు చేశాడ‌ని అన్నారు. ఆ మ‌హిళ చివ‌ర‌కు పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌డంతో ఈ మోసం బ‌య‌ట‌ప‌డింద‌ని చెప్పారు. నిందితుల నుంచి 8 ల్యాప్‌టాప్‌లు, 26 మొబైల్‌ఫోన్లు, 10 ఇంటర్నెట్‌ డేటాకార్డులు, 35 సిమ్‌కార్డులను సీజ్ చేసిన‌ట్లు తెలిపారు.        

  • Loading...

More Telugu News