: ఇప్పటి పిల్లల్లో ఆ విషయం నాకు నచ్చదు: విరాట్ కోహ్లీ


తన ఆట‌తీరును మెరుగుప‌ర్చుకోవ‌డంతో పాటు ఫిట్‌నెస్‌ను కాపాడుకోవ‌డం కోసం టీమిండియా సార‌థి విరాట్ కోహ్లీ ఎంతో హార్డ్ వ‌ర్క్ చేస్తాడు. కోహ్లీ త‌న అంకితభావం, నిబ‌ద్ధ‌త‌తో క్రికెట్లో అద్భుతంగా రాణిస్తూ ఎంతో మంది యువ‌త‌కు ఆద‌ర్శంగా నిలుస్తున్నాడు. కాగా, కోహ్లీకి నేటి పిల్ల‌ల్లో ఓ అంశం అంటే అస్స‌లు న‌చ్చ‌ద‌ట‌. తాజాగా ఆయ‌న ఓ కార్య‌క్ర‌మంలో మాట్లాడుతూ ఈ విష‌యాన్ని తెలిపాడు.

 ఈ కాలంలో పిల్ల‌లు స్మార్ట్‌ఫోన్లు, ఐ- పాడ్‌ల‌తోనే త‌మ స‌మ‌యాన్ని అధికంగా వెచ్చిస్తున్నార‌ని అన్నాడు. తాము మాత్రం చిన్న‌తనంలో మైదానాల్లో, పార్కుల్లో, వీధుల్లో ఆడుకోవ‌డానికే అధిక ప్రాధాన్య‌తనిచ్చేవారమ‌ని చెప్పాడు. తమ స్నేహితుల్లో ఎవ‌రి వ‌ద్ద అయినా వీడియో గేమ్ ఉంటే అత‌డి ఇంటికి వెళ్లి కొద్ది సేపు వీడియో గేమ్ ఆడుకొని వ‌చ్చేవారమ‌ని అన్నాడు. ఇప్ప‌టి పిల్ల‌లు మాత్రం అలాలేర‌ని అన్నాడు.

  • Loading...

More Telugu News