: బాలీవుడ్ విశ్లేషకుల ప్రశంసలు సైతం అందుకుంటోన్న జూనియర్ ఎన్టీఆర్ నటన
జూనియర్ ఎన్టీఆర్ నటించిన ‘జై లవకుశ’ థియేట్రికల్ ట్రైలర్ నిన్న విడుదలైన విషయం తెలిసిందే. ఇందులో కనిపించిన ఎన్టీఆర్ నటనకు టాలీవుడ్‌కి చెందిన ప్రముఖులే కాకుండా బాలీవుడ్ సినీ విశ్లేషకులు కూడా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. మూడు పాత్రల్లో ఎన్టీఆర్ కనిపించిన తీరు అందరితోనూ వావ్ అనిపిస్తోంది. ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్‌తో ఉన్న ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను తాజాగా బాలీవుడ్ విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేస్తూ ఎన్టీఆర్‌ను కొనియాడాడు. ఈ ట్రైలర్ అద్భుతంగా ఉందని, జూనియర్ ఎన్టీఆర్ కళ్లు, హావభావాలతో పాటు ఆయనలోని కామెడీ యాంగిల్ అద్భుతమని పేర్కొన్నాడు.