: అయోధ్య‌కేసులో మ‌రో అప్‌డేట్: కొత్త ప‌రిశీల‌కుల‌ను నియ‌మించాల‌ని అల‌హాబాద్ కోర్టుకు సుప్రీం ఆదేశం


అయోధ్య‌కేసు విచార‌ణ చివరి దశకు చేరుతున్న నేప‌థ్యంలో 10 రోజుల్లోగా అయోధ్య భూవివాదం విష‌యంలో కొత్త ప‌రిశీల‌కుల‌ను నియ‌మించాల‌ని అలహాబాద్ కోర్టును భార‌త అత్యున్న‌త న్యాయ‌స్థానం ఆదేశించింది. ఇంత‌కు ముందు నియ‌మించిన ప‌రిశీల‌కుల్లో ఒక‌రు ప‌ద‌వీ విర‌మ‌ణ చేయ‌గా, మ‌రొక‌రు హైకోర్టుకు ప‌దోన్న‌తి పొందార‌ని అల‌హాబాద్ హైకోర్టు సుప్రీంకు విన్న‌వించుకుంది. ఈ వివాదానికి సంబంధించిన చివ‌రి విచార‌ణ డిసెంబ‌ర్ 5న జ‌ర‌గ‌నుంది. 2010లో అల‌హాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పునే స‌వాలు చేస్తూ జారీ అయిన పిటిష‌న్ల‌ను సుప్రీంకోర్టు విచారించింది. అలాగే హిందీ, సంస్కృతం, ఉర్దూ, ప‌ర్షియ‌న్‌, పాలీ, అర‌బిక్ భాష‌ల్లో ఉన్న అప్పీళ్ల‌ను ప‌ది వారాల్లోగా ఆంగ్లంలోకి త‌ర్జుమా చేసి అందించాల‌ని జ‌స్టిస్ దీప‌క్ మిశ్రా ధ‌ర్మాస‌నం ఆదేశించింది.

  • Loading...

More Telugu News