: ‘టెక్‌ఫెస్ట్’.. హైదరాబాద్‌లో మరో ప్రతిష్టాత్మక సదస్సు
యువ సాంకేతిక నిపుణులను ప్రోత్సహించే ఉద్దేశంతో నిర్వహించే అతిపెద్ద టెక్నాలజీ, కెరీర్ కాన్ఫరెన్స్ ‘టెక్‌ఫెస్ట్ 2017’ ఈ నెల 17, 18 వ తేదీల్లో హైదరాబాద్‌లోని జేఎన్‌టీయూలో జరగనుంది. ఈ ఫెస్ట్‌లో ముఖ్యంగా టెక్నాలజీ దుర్వినియోగం, శాస్త్రీయ దృక్పథం, సృజనాత్మకత వంటి విషయాలపై చర్చించనున్నారు. ప్రపంచవ్యాప్తంగా సాంకేతిక రంగంలో వస్తున్న మార్పులపై కూడా ఇందులో చర్చిస్తారు. విద్యార్థులు తమకు ఉన్న సందేహాలను నిపుణుల ముందు ఉంచి వాటిని నివృత్తి చేసుకోవచ్చు. ఈ ఫెస్ట్‌లో దేశ నలుమూలల్లోని కాలేజీల నుంచి వచ్చే వందలాది మంది విద్యార్థులు పాల్గొననున్నారు.