: ఎయిర్‌టెల్‌లోనూ వాయిస్‌ఓవర్ ఎల్టీఈ సర్వీసు వచ్చేసింది!
రిలయన్స్ జియో బాటలోనే పయనిస్తూ ఎయిర్‌టెల్ కూడా వాయిస్‌ఓవర్ ఎల్టీఈ (వోల్ట్) కాలింగ్ సర్వీసులను అందుబాటులోకి తీసుకొచ్చింది. దేశంలో ఇప్పటివరకు ఈ సర్వీసును జియో మాత్రమే అందిస్తోన్న విషయం తెలిసిందే. ఈ సర్వీసులతో ఇంటర్నెట్ డేటాను వాడుకుంటూ వినియోగదారులు తమ వాయిస్ కాల్స్‌ను మెరుగుపరుచుకోవచ్చు. అంతేగాక, ఇందుకోసం ఎయిర్‌టెల్ ఎలాంటి అదనపు ఛార్జీలను తీసుకోదు. ఈ రోజు ఎయిర్‌టెల్ ఈ సర్వీసులను ముంబైలో ప్రారంభించింది. త్వరలోనే దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. ఎయిర్‌టెల్ తమ 3జీ, 2జీ నెట్‌వర్క్‌లకు కూడా ఈ సర్వీసులను అందించనుంది.