: ఏపీ డీజీపీ సాంబశివరావుకు తప్పిన ప్రమాదం!


ఏపీ డీజీపీ సాంబశివరావు తృటిలో ప్రమాదం నుంచి బయటపడ్డారు. పశ్చిమగోదావరి జిల్లా తణుకు నుంచి విజయవాడకు డీజీపీ కారు వెళుతోంది. ఆ కారు ముందు వెళుతున్న ఓ లారీ డ్రైవర్ సడెన్ బ్రేక్ వేయడంతో ఆ వాహనాన్ని ఈ కారు ఢీ కొట్టింది. కారు ముందు భాగం దెబ్బతినగా, ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగలేదని తెలుస్తోంది. వెంటనే, మరో కారులో విజయవాడకు డీజీపీ బయలుదేరి వెళ్లారు. ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

  • Loading...

More Telugu News