: ఐటీ అభివృద్ధిపై త్వరలో ఓ ముఖ్యమైన ప్రకటన చేస్తా: మంత్రి నారా లోకేశ్


ఐటీ అభివృద్ధికి సంబంధించి త్వరలో ఓ ముఖ్యమైన ప్రకటన చేయనున్నట్టు ఏపీ మంత్రి నారా లోకేశ్ చెప్పారు. వచ్చే రెండు నెలల్లో ఈ ప్రకటన చేయనున్నామని, 2018 నాటికి ముప్పై వేల ఉద్యోగాలు కల్పిస్తామని అన్నారు. తాను ఐటీ మంత్రిగా బాధ్యతలు చేపట్టాక, 30 ఐటీ కంపెనీలు ఏర్పాటయ్యాయని, ఆరు వేల మందికి ఉద్యోగాలు కల్పించామని, అక్టోబర్ నాటికి కాపులుప్పాడ ఐటీ లేఔట్ ను అందుబాటులోకి తెస్తామని, ఇది పూర్తయితే 40 వేల ఉద్యోగాలు అందుబాటులోకి వస్తాయని చెప్పారు. సోషల్ లైఫ్ కోసం విశాఖలో నెలకొక ఈవెంట్ నిర్వహించాలనే ఆలోచనలో ఉన్నామని, యువతను ఆకర్షించేలా విశాఖను తీర్చిదిద్దుతామని లోకేశ్ పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News