: పెట్రోల్‌, డీజిల్‌ కార్లపై నిషేధం విధించే దిశగా చైనా కీలక నిర్ణయాలు


పెట్రోల్‌, డీజిల్‌తో నడిచే కార్లపై నిషేధం విధించాలని చైనా యోచిస్తోంది. తాజాగా ఆ దేశ మంత్రి ఒకరు మాట్లాడుతూ... ఆ కార్ల‌పై నిషేధం విధించే అంశంపై త‌మ దేశం ఇప్ప‌టికే పరిశోధనను ప్రారంభించిందని తెలిపారు. ఈ కార్ల‌పై ఎప్పటి నుంచి నిషేధం విధించాల‌నే అంశంపై ఓ నిర్ణ‌యం తీసుకోవాల్సి ఉంద‌ని చెప్పారు. త‌మ దేశంలోని కార్ల‌ పరిశ్రమ అభివృద్ధి కోసమే ఈ చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ట్లు తెలిపారు. అయితే, ప్రపంచంలో కార్లకు అతిపెద్ద మార్కెట్‌గా చైనానే ఉండ‌డంతో ఈ నిర్ణయం ఆటోమొబైల్‌ తయారీ పరిశ్రమపై తీవ్ర ప్రతికూల ప్రభావం ప‌డుతుంద‌ని విశ్లేష‌కులు అంటున్నారు.

చైనా అధికంగా సంప్రదాయ ఇంధనాలపై ఆధారపడుతుంది. దీంతో కాలుష్యం పెరిగిపోతూ వ‌స్తుండ‌డంతో ఈ నిర్ణ‌యం తీసుకుంది. 2020 కల్లా ఎలక్ట్రిక్‌, హైబ్రిడ్‌ పెట్రోల్‌-ఎలక్ట్రిక్‌ వాహనాల షేరును 12 శాతం పెంచాలని చైనా ప్ర‌భుత్వం ఇప్ప‌టికే వాహ‌న‌ తయారీదారులకు సూచ‌న‌లు చేసింది. అంతేగాక‌, ఎలక్ట్రిక్‌ వాహనాల త‌యారీ కోసం ప్ర‌ణాళికల‌ను రూపొందించుకుని ముందుకు పోతోంది.

  • Loading...

More Telugu News