: చిరంజీవి, పవన్ కల్యాణ్‌ల మద్దతు కోసం యత్నిస్తోన్న జగన్?
నంద్యాల ఉపఎన్నికలు, కాకినాడ కార్పోరేషన్ ఎన్నికల ఫలితం దెబ్బతో పార్టీని పటిష్టం చేసేందుకు వైఎస్సార్‌సీపీ అధినేత జగన్ కొత్త వ్యూహాలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా త్వరలో తమ పార్టీకి మెగాస్టార్ చిరంజీవి, పవన్ కల్యాణ్‌ల మద్దతు కోరనున్నట్లు సమాచారం. 2019 ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించేందుకు వ్యూహాలను సూచించాలని ఇటీవల తమ పార్టీ రాజకీయ నిపుణుడు ప్రశాంత్ కిషోర్‌ని కోరినట్లు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. అంతేకాకుండా పార్టీకార్యకర్తలతో సమావేశం ఏర్పరచి పార్టీ అభివృద్ధి కోసం ఓ కమిటీ ఏర్పాటు చేసే యోచనలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.