: ‘అది నాకు దక్కిన అరుదైన గౌరవం’.. అంటూ 30 ఏళ్ల క్రితం నాటి అరుదైన ఫొటోను పోస్ట్ చేసిన మోహన్ బాబు


విల‌న్ పాత్ర‌లతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చి ఆ త‌రువాత హీరో పాత్ర‌లను వేసి మంచి పేరు తెచ్చుకున్న న‌టుడు మోహ‌న్ బాబు సుమారు 30 ఏళ్ల క్రితం నాటి ఓ అరుదైన ఫొటోను త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో పోస్ట్ చేశారు. అందులో అల‌నాటి అగ్ర క‌థానాయ‌కులు నంద‌మూరి తార‌క‌ రామారావు, అక్కినేని నాగేశ్వ‌రరావుతో పాటు మోహ‌న్ బాబు ఉన్నారు. వారిరువురూ మోహ‌న్ బాబు భుజాల‌పై చేయి వేసి ఉన్నారు. ‘నటుడిగా అప్పుడే ఓనమాలు దిద్దుతున్న నాకు, ఇద్దరు మహా నటులతో కలిసి నటించే అవకాశం రావడం ఓ సవాల్! అది నాకు దక్కిన అరుదైన గౌరవం’ అని త‌న ట్విట్ట‌ర్‌లో మోహ‌న్ బాబు పేర్కొన్నారు. ఈ ఫొటో మంచు వారి అభిమానుల‌తో పాటు నంద‌మూరి, అక్కినేని అభిమానుల‌ను అల‌రిస్తోంది.  

  • Loading...

More Telugu News