: వీడియోలను వేగంగా వీక్షించే సదుపాయం కల్పించిన యూట్యూబ్
రెండ్రోజుల క్రితం వచ్చిన కొత్త అప్డేట్ ద్వారా ఆండ్రాయిడ్, ఐఓఎస్ ఫోన్లలోని యూట్యూబ్ యాప్‌లో వీడియోలను వేగంగా వీక్షించే సదుపాయం అందుబాటులోకి వచ్చింది. ఇంతకుముందు వీడియో వేగాన్ని పెంచుకునే సదుపాయం యూట్యూబ్‌లో లేదు. ఈ సదుపాయం ద్వారా యూట్యూబ్ వీడియో ప్లేబ్యాక్ స్పీడ్‌ను కనిష్టంగా 0.25 నుంచి 2 రెట్ల వరకు పెంచుకోవచ్చు.
వీడియో ప్లే అవుతుండగా యాప్‌లో ఉన్న సెట్టింగ్స్ ఆప్షన్స్ నుంచి వీడియో ప్లేబ్యాక్‌ను మార్చుకోవచ్చు. డీఫాల్ట్‌గా ఇది `నార్మల్`కి సెట్ చేసి ఉంటుంది. అలాగే హెచ్డీ వీడియో స్ట్రీమింగ్ సపోర్ట్ చేసే గూగుల్ పిక్సెల్, ఎల్జీ వీ30, శాంసంగ్ గెలాక్సీ ఎస్8, సోనీ ఎక్స్‌పీరియా ఎక్స్జెడ్ ప్రీమియం వంటి ఫోన్లకు హెచ్డీఆర్ ప్లేబ్యాక్ వీడియో స్ట్రీమింగ్ చేసుకునే సౌకర్యాన్ని కూడా యూట్యూబ్ యాప్ కల్పించింది.