: కేంద్ర హోం శాఖ ఉత్తర్వులపై స్టే.. హైకోర్టులో చెన్నమనేని రమేశ్‌కు ఊరట
పౌరసత్వం రద్దు కేసులో వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ కు హైకోర్టులో ఊరట లభించింది. రమేశ్ పౌరసత్వం రద్దు చేస్తూ కేంద్ర హోం శాఖ ఇచ్చిన ఉత్తర్వులను కోర్టు తాత్కాలికంగా నిలిపివేసింది. పున:సమీక్షించాలని కేంద్ర హోం శాఖను రమేశ్ కోరారు. ఎమ్మెల్యే అభ్యర్థనపై ఆరు వారాల్లోగా తేల్చాలని హైకోర్టు కేంద్రాన్ని ఆదేశించింది.
కాగా, చెన్నమనేని రమేశ్ కు జర్మనీ పౌరసత్వం ఉందని హోం శాఖ సంయుక్త కార్యదర్శి నిర్ధారించడంతో, ఆయన భారత పౌరసత్వాన్ని రద్దు చేస్తూ కేంద్ర హోం శాఖ గత మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. దీనిని సవాల్ చేస్తూ రమేశ్ హైకోర్టును ఆశ్రయించారు.