: భారత పర్యటన మాకు పెద్ద సవాల్.. ఇప్పుడు ఇండియాను ఎదుర్కోవడం చాలా కష్టం: ఆస్ట్రేలియా కెప్టెన్


ఇండియాలో ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు పర్యటిస్తోంది. ఈ నెల 17వ తేదీన ఇరు దేశాల మధ్య తొలి వన్డే జరగబోతోంది. ఈ నేపథ్యంలో ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ మాట్లాడుతూ, ప్రస్తుత భారత పర్యటన తమకు ఎంతో కష్టసాధ్యమైనదని చెెప్పారు. గత కొద్ది కాలంగా టీమిండియా అద్భుత విజయాలను సాధిస్తోందని... శ్రీలంక పర్యటనలో తిరుగులేని ప్రదర్శన చేసిందని తెలిపాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఇండియాను ఢీకొనడం కష్టమని, తమకు ఈ పర్యటన ఓ సవాల్ లాంటిదని చెప్పాడు. ఇదే సమయంలో కోహ్లీ సేనను ఎదుర్కొనేందుకు తాము ఆత్రుతగా ఉన్నామని తెలిపాడు. ఈ సిరీస్ లో భారత్ తో ఐదు వన్డేలు, మూడు టీ20లను ఆస్ట్రేలియా ఆడనుంది.

  • Loading...

More Telugu News