: ఎంఐ మిక్స్ 2 వచ్చేసింది... ఫీచర్స్ సూపర్!
సోమవారం మధ్యాహ్నం చైనాలో జరిగిన ఓ కార్యక్రమంలో స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ షివోమి మరో రెండు స్మార్ట్ ఫోన్లను విడుదల చేసింది. ఇప్పటికే విజయవంతమైన ఎంఐ మిక్స్ కు సక్సెసర్ గా ఎంఐ మిక్స్ 2ను, ఎంఐ నోట్ బుక్ ప్రోను అందుబాటులోకి తెచ్చింది. ఎంఐ మిక్స్ 2 ఫీచర్స్ సూపర్ గా ఉన్నాయని స్మార్ట్ ఫోన్ ప్రియులు వ్యాఖ్యానిస్తున్నారు.
ఇక ఈ ఫోన్ ఫీచర్స్ విషయానికి వస్తే, 5.99 అంగుళాల ఫుల్ స్క్రీన్ డిస్ ప్లే, 6, 8 జీబీ ర్యామ్ (ఎంచుకునే వేరియంట్ ను బట్టిశ, 64/128/256 అంతర్గత స్టోరేజ్, 16/12 ఎంపీ కెమెరాలు, 3400 ఎంఏహెచ్ బ్యాటరీ సదుపాయాలున్నాయి. ఐఫోన్ 7కు ఇది గట్టి పోటీ ఇస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. కాగా, వీటి ధరలు రూ. 32,334 (6 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్) నుంచి రూ. 39 వేల (6 జీబీ ర్యామ్ / 256 జీబీ స్టోరేజ్) మధ్య ఉంటుందని సంస్థ పేర్కొంది. కాగా, వెనుకవైపున్న కెమెరా రింగ్ ను 18 క్యారెట్ గోల్డ్ తో తయారు చేసి అమర్చామని సంస్థ తెలిపింది.