: 100 రోజులు.. 28 ప్రాజెక్టులు: చంద్రబాబు


రానున్న 100 రోజుల్లో 28 ప్రాజెక్టులు పూర్తి చేయనున్నామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. గోదావరిలో వరద నీరు తగ్గిందని, ఇదే సమయంలో కృష్ణా నదిలో ప్రవాహం పెరిగిందని చెప్పారు. శ్రీశైలం డ్యామ్ కు మూడు రోజుల్లో 10 టీఎంసీల నీరు వచ్చిందని తెలిపారు. నీరు-ప్రగతి, వ్యవసాయం పురోగతిపై నిర్వహించిన టెలికాన్ఫరెన్స్ లో ఆయన ఈ విషయాలను వెల్లడించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని వేగవంతం చేయాలని, రాష్ట్ర వ్యాప్తంగా 11వేల చెక్ డ్యామ్ ల నిర్మాణాలను వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు.

  • Loading...

More Telugu News