: కేంద్ర మంత్రిగా ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారా?: సిద్ధరామయ్య


మహిళా జర్నలిస్ట్ గౌరి లంకేష్ హత్య కేసులో కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ చేసిన వ్యాఖ్యలు బాధ్యతారహితంగా ఉన్నాయని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మండిపడ్డారు. ఆమె ప్రాణాలకు ముప్పు ఉన్నట్టు తెలిసినా, ప్రభుత్వం స్పందించలేదని రవిశంకర్ ప్రసాద్ విమర్శించడం దారుణమని అన్నారు. ఆమెకు ప్రమాదం ఉన్నట్టు ప్రభుత్వం వద్ద సమాచారం లేదని... భద్రత కావాలని ఆమె కోరి ఉంటే, తగిన ఏర్పాట్లను కచ్చితంగా చేసేవారమని చెప్పారు. హత్యపై సిట్ వేశామని... త్వరలోనే హంతకులను పట్టుకుంటామని తెలిపారు.

  • Loading...

More Telugu News