: `జోర్డాన్‌లోనే కాదు గ్రామీణ భారత్‌లోనూ అనాథలు ఉన్నారు!` అంటూ నెటిజన్ కామెంట్... గట్టిగా సమాధానం చెప్పిన ప్రియాంకచోప్రా!
టొరంటో అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్ తర్వాత యునిసెఫ్ గుడ్‌విల్ అంబాసిడర్‌గా సిరియాలోని పిల్లలకు విద్యా సహాయం చేయడానికి గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా జోర్డాన్ వెళ్లింది. తన జోర్డాన్ జర్నీ గురించి ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటోంది. ఈ నేపథ్యంలోనే సిరియా అనాథ పిల్లలతో దిగిన ఫొటోను ఆమె షేర్ చేశారు.
ఆ ఫొటోపై ఓ నెటిజన్... `గ్రామీణ భారత్‌లోనూ ఆకలితో బాధపడుతున్న పిల్లలు ఉన్నారు. వారికి సహాయం చేయాలని నేను ప్రియాంకను కోరుతున్నాను` అంటూ కామెంట్ చేశాడు. దీనిపై ప్రియాంక గట్టిగా స్పందించింది. `నేను యునిసెఫ్‌తో కలిసి 12 సంవత్సరాలుగా పిల్లల క్షేమం కోసం పనిచేస్తున్నాను. ఎన్నో దేశాలు సందర్శించాను. నువ్వు ఏం చేశావ్? నాకు ప్రపంచంలోని అందరు పిల్లలు ఒకటే. వాళ్లలో తేడాలెందుకు చూపించాలి?` అని ఆమె ఆ నెటిజన్‌ను ప్రశ్నించింది.