: ఇర్మా పరిస్థితిని సమీక్షించిన ట్రంప్... ఒకటో నెంబర్ తీవ్రతకు చేరిన తుపాను
అమెరికాలోని ఫ్లోరిడాను 230 కిలోమీటర్ల వేగంతో ఇర్మా తుపాను ఢీ కొట్టింది. ఈ ప్రచండ గాలుల ధాటికి ఫ్లోరిడాలోని చెట్టూ చేమ అనే తేడాలేకుండా చిగురుటాకులా వణికింది. అద్దాల మేడలు గాలుల వేగాన్ని అడ్డుకోలేకపోయాయి. దీంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పరిస్థితిని సమీక్షించారు. ఐదు రాష్ట్రాల గవర్నర్ లతో ఆయన మాట్లాడారు. అమెరికా మొత్తం బాధితుల వెంట ఉంటుందని తెలిపారు.
ఇది చాలా ప్రమాదకరమైన తుపాను అని ఆయన చెప్పారు. అన్ని విభాగాల సిబ్బంది సమన్వయంతో పని చేస్తున్నారని ఆయన అన్నారు. సహాయకచర్యలు వేగంగా జరుగుతున్నాయని ఆయన చెప్పారు. సురక్షిత ప్రాంతాల్లో ఉన్నవారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టామని ఆయన తెలిపారు. సహాయకచర్యల్లో పాలు పంచుకుంటున్న సిబ్బందికి అన్ని రకాలుగా సహకరిస్తున్నామని ఆయన తెలిపారు. ప్రస్తుతం ఈ తుపాను ఒకటో నెంబర్ తీవ్రతకు చేరుకుందని ఆయన తెలిపారు.