nagarjuna: నాగ్, నాని కాంబినేషన్ ఖరారైనట్టే!

నాగ్ .. నాని కాంబినేషన్లో ఒక మల్టీ స్టారర్ తెరకెక్కనున్నట్టు కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. అది నిజమేనన్నది తాజా సమాచారం. దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య ఈ సినిమాకి దర్శకుడిగా వ్యవహరించనున్నాడు. 'భలేమంచి రోజు' .. 'శమంతకమణి' సినిమాలను తెరకెక్కించిన శ్రీరామ్ ఆదిత్య, నాగ్ .. నాని కాంబినేషన్ లో ఒక సినిమా చేయాలనే ఉద్దేశంతో ఒక కథను సిద్ధం చేసుకున్నాడట.

ఆ స్టోరీ లైన్ ను ఆయన నాగ్ .. నానిలకు వినిపించాడు.  ఇద్దరినీ కూడా ఈ ప్రాజెక్టు చేయడానికి ఒప్పించాడని అంటున్నారు. అయితే 'రాజుగారి గది 2' చేసిన నాగార్జున, ప్రస్తుతం అఖిల్ రెండవ సినిమాకి సంబంధించిన వ్యవహారాలు చూసుకుంటున్నారు. ఇక నాని ప్రస్తుతం చేస్తున్నవి కాకుండా మరో రెండు సినిమాలు లైన్లో పెట్టాడని అంటున్నారు. ఈ నేపథ్యంలో నాగ్ - నాని కాంబినేషన్ ఎప్పుడు సెట్స్ పైకి వెళుతుందో చూడాలి. 

More Telugu News