: 9/11కు మన అసమర్థతే కారణం: ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు


ముంబైపై ఉగ్రవాదులు విరుచుకుపడటానికి మన అసమర్థతే కారణమని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. షికాగోలో స్వామి వివేకానంద స్ఫూర్తిదాయక ప్రసంగం చేసి 125 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా జరిగిన ఓ కార్యక్రమంలో ఈ ఉదయం ప్రసంగించిన ఆయన, దీన్ దయాళ్ ఉపాధ్యాయ శతజయంతి ఉత్సవాల్లో పాల్గొన్నారు. 1983లో వివేకానందుడు షికాగోలో అమెరికన్లను ఉద్దేశించి ప్రసంగించారని గుర్తు చేసిన ఆయన, 'యంగ్ ఇండియా - న్యూ ఇండియా' నినాదంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. స్వామి వివేకానంద ఆలోచనల నుంచి స్ఫూర్తిని పొంది కలలను సాకారం చేసుకునే దిశగా యువత ముందడుగు వేయాలని ఆయన కోరారు. పాలకుల నిర్లక్ష్యం కారణంగానే నాడు ముంబైపై ముష్కరులు దాడికి తెగబడ్డారని విమర్శించారు. నిఘా వర్గాలు మరింత అప్రమత్తంగా ఉంటే వందలాది ప్రాణాలు మిగిలేవని అభిప్రాయపడ్డారు.

  • Loading...

More Telugu News