: సినిమాల్లో అవకాశాల కోసం వచ్చిన అమ్మాయిని వ్యభిచారంలోకి దింపిన కేటుగాళ్లు!


స్నేహితురాళ్లంతా చాలా అందంగా ఉంటావని చెప్పారు. వెంటపడిన యువకులు కూడా హీరోయిన్ లా ఉంటావన్నారు. దీంతో సినిమాల్లో వెలిగిపోవాలని, ముఖానికి రంగేసుకుని సెలబ్రిటీగా మారాలని భావించిన విద్యావంతురాలు వ్యభిచారిగా పోలీసులకు పట్టుబడిన ఘటన హైదరాబాదులో చోటుచేసుకుంది. యూసుఫ్‌ గూడ సమీపంలోని ఎల్‌ఎన్‌ నగర్‌ లో నాగభాస్కర్‌ అలియాస్‌ విక్కి కొంత కాలంగా వ్యభిచార గృహాన్ని నిర్వహిస్తున్నాడు. అందులో అతని అసిస్టెంట్లుగా పి.సాయి దుర్గాప్రసాద్‌ అలియాస్‌ కార్తీక్, పి.ధర్మ పని చేస్తున్నారు. వీరి పని ఏంటంటే... అందమైన యువతుల అలవాట్లు, అవసరాలను ఆసరగా చేసుకుని వారిని ముగ్గులోకి లాగడం.

ఈ నేపథ్యంలో సినిమాల్లో నటించాలని ఉందని, అయితే అందుకు మేకప్, దుస్తులు, ఫోటో షూట్ ఖర్చుల కోసం డబ్బులు లేవన్న ఆలోచనలో ఉన్న యువతి వీరికి పరిచయమైంది. దీంతో సినిమాల్లో అవకాశాల కోసం అంటూ ఫోటోలు తీశారు. అనంతరం విషయం ఆమెకు వివరించి, ఇదంతా 'నీ సినిమా కోరిక తీర్చేందుకే' అని ట్రాప్ చేసి, ఆమె ఫోటోలను యువకులకు పంపారు. చాలా మంది ఆమెతో సుఖం పంచుకునేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు.


దీంతో విటులతో కలిసి ఉన్న సమయంలో ఆమెను పోలీసులు పట్టుకున్నారు. ఆమెను విచారించగా, ఇంజనీరింగ్ చివరి సంవత్సరం చదువుతున్నట్టు గుర్తించారు. ఆమెతో పాటు ముంబై మొడల్ ను కూడా అరెస్టు చేసినట్టు పోలీసులు తెలిపారు. దీంతో వారిని నింబోలి అడ్డాలోని పునరావాస కేంద్రానికి తరలించారు. విక్కీ పరారీలో ఉండగా, కార్తీక్, ధర్మను అరెస్టు చేసి, వారిపై ఐపీసీ సెక్షన్‌ 370, 370ఏ, పీటా యాక్ట్‌ కింద కేసులు పెట్టారు. 

  • Loading...

More Telugu News