: కోహ్లీ ట్వీట్ పై ఇండియాలో విమర్శలు వెల్లువెత్తుతుంటే.. పాకిస్థాన్ లో మాత్రం ప్రశంసలు దక్కుతున్నాయ్!
టీచర్స్ డే సందర్భంగా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ట్విట్టర్ లో పెట్టిన పోస్ట్ వివాదాస్పదం అయిన సంగతి తెలిసిందే. అందులో ప్రపంచంలోని అత్యుత్తమ క్రికెటర్ల పేర్లు కనబడుతుండగా, వాటి ముందు తాను కూర్చున్న ఫొటోను కోహ్లీ పోస్ట్ చేశాడు. ఇందులో భారతీయ క్రికెట్ దిగ్గజాలు గవాస్కర్, కుంబ్లేల పేర్లు లేకపోవడంతో ఇండియన్ నెటిజన్లు కోహ్లీపై మండిపడుతున్నారు. ఇదే సమయంలో పాకిస్థానీల నుంచి కోహ్లీకి అనూహ్యంగా మద్దతు లభిస్తోంది. కోహ్లీ వెనకున్న పేర్లతో తమ దేశ దిగ్గజాలు ఇమ్రాన్ ఖాన్, జావెద్ మియాందాద్, ఇంజమమ్ ఉల్ హక్ ల పేర్లు ఉండటంతో వారు ఎంతో సంతోషిస్తున్నారు.