: ఆదర్శ్ చేసిన తప్పిదం వల్ల బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన ప్రిన్స్
జూనియర్ ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న 'బిగ్ బాస్' షో నుంచి నటుడు ప్రిన్స్ ఎలిమినేట్ అయ్యాడు. ఆదర్శ్ చేసిన తప్పిదం వల్ల ప్రిన్స్ ఎలిమినేట్ అయ్యాడు. 'బిగ్ బాస్ హౌస్' లో ఇప్పటి వరకు ఉన్నవారిలో ప్రిన్స్ బలమైన కంటెస్టెంట్. గత వారం జరిగిన ఎలిమినేషన్ రౌండ్ లో 'ఇతరులను ఎలిమినేట్ చేయడానికి కారణాలు లేని కారణంగా, తన స్నేహితుడు తనను అర్థం చేసుకుంటాడని, షోలో నియంత్రణతో వ్యవహరించే ప్రిన్స్ బలమైన కంటెస్టెంట్ కావడంతో ఎలిమినేట్ అయ్యే అవకాశం లేదని అతనిని నామినేట్ చేస్తున్నా'నని ఆదర్శ్ తెలిపాడు. దీంతో ఎలిమినేషన్ విభాగానికి ప్రిన్స్ నామినేట్ అయ్యాడు. ఈ ఎలిమినేషన్ లో ఆదర్శ్ కూడా ఉండడం విశేషం. ఈ నేపథ్యంలో స్వల్ప ఓట్ల తేడాతో ప్రిన్స్ ఎలిమినేట్ కాగా, ఆదర్శ్ సేఫ్ అయ్యాడు. దీంతో షో నుంచి ప్రిన్స్ నిష్క్రమించాడు. ప్రస్తుతం బిగ్ బాస్ షోలో ముగ్గురు మహిళలు, ముగ్గురు పురుష కంటెస్టెంట్స్ ఉండడం విశేషం.