: తుపాన్ల కన్నా పదింతలు శక్తిమంతమైన మేము అమెరికాను ముంచెత్తుతాం!: ఉత్తర కొరియా తాజా హెచ్చరిక
అమెరికాను ముంచెత్తేది తుపానులు, హరికేన్లు కాదని, అంతకు పదింతలు శక్తిమంతమైన తాము విరుచుకుపడతామని ఉత్తర కొరియా తాజా హెచ్చరికలు జారీ చేసింది. ఉత్తర కొరియాపై మరిన్ని ఆంక్షలు విధించాలని అమెరికా చేస్తున్న ప్రయత్నాలపై తీవ్రంగా స్పందించిన ఆ దేశ విదేశాంగ శాఖ... అమెరికా ఆత్మ రక్షణలో పడే, ఐక్యరాజ్యసమితిని అడ్డు పెట్టుకుని తమపై ఒత్తిడి తెస్తోందని ఆరోపించింది.
ఐరాసకు ఇచ్చిన ఓ ముసాయిదా ఆంక్షల పత్రంలో తమ దేశం నుంచి ఆయిల్, చేనేత ఉత్పత్తుల దిగుమతులను అన్ని దేశాలూ నిలిపివేయాలని, తమ అధినేత కిమ్ జాంగ్ ఉన్ పై ప్రయాణ నిషేధం విధించాలని యూఎస్ ఐరాసపై ఒత్తిడి తెస్తోందని ఆరోపించింది. కాగా, హైడ్రోజన్ బాంబును ఉత్తర కొరియా పరీక్షించిన తరువాత, ఆ దేశంపై అంతర్జాతీయ స్థాయిలో ఒత్తిడి పెరుగుతున్న సంగతి తెలిసిందే.