: అమెరికన్లకు కొత్త భయం... ప్రజలు ఇళ్లు ఖాళీ చేస్తే, దొంగలు సర్వం ఊడ్చేస్తున్నారు!
భయంకరమైన పెను తుపాను నుంచి తమను తాము కాపాడుకునేందుకు ఉంటున్న ఇళ్లను వదిలి సురక్షిత ప్రాంతాలకు అమెరికన్లు తరలి పోతుండగా, ఇదే అదనుగా చూసుకుని దొంగలు రెచ్చిపోతున్నారు. ప్రజలు ఇళ్లను వదిలేసి వెళ్లిపోయారన్న సమాచారంతో ఖాళీగా ఉన్న ఇళ్లలోకి చొరబడి విలువైన వస్తువులను అందిన కాడికి దోచుకుంటున్నారు. ఖాళీగా ఉన్న ఇళ్లే వీరి లక్ష్యాలవుతున్నాయి. ముఖ్యంగా ఫ్లోరిడా తీర ప్రాంతాలతో పాటు ఓర్లాండో, పామ్ బీచ్ తదితర ప్రాంతాల్లో కరెంట్ సరఫరా లేకపోవడం దొంగలకు అనువుగా మారింది. ఫ్లోరిడాలో దొంగతనాలకు దిగుతున్న పలువురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుత పరిస్థితిలో ఎవరైనా వచ్చి తలుపు తట్టినా తీయాల్సిన అవసరం లేదని, సహాయం కావాల్సిన వారు ఇప్పటికే శిబిరాలకు చేరుకున్నారని పోలీసులు సూచిస్తున్నారు.