: జైలులో డేరా బాబాను పరీక్షించిన వైద్యులు చెప్పినదేంటంటే...!


డేరాబాబా ఓ కామపిశాచి అని వైద్యులు తేల్చి చెప్పారు. 20 ఏళ్ల జైలు శిక్ష అనంతరం జైలులోకి వెళ్లిన ఆయన మూడీగా ఉంటూ, గోడలతో మాట్లాడుతూ, ఏడుస్తూ గడుపుతున్నాడు. సరిగా భోజనం కూడా చేయడం లేదు. దీంతో అతనికి జైలులో వైద్యపరీక్షలు నిర్వహించారు. అనంతరం వారు పలు విషయాలను జైలు అధికారులకు తెలిపారు. ఇన్నాళ్లుగా అనుభవించిన సుఖవంతమైన జీవితానికి ఆయన దూరం కావడంతో ఈ విధంగా ప్రవర్తిస్తున్నారని అన్నారు.

ఆయన రెగ్యులర్‌ గా అనుభవిస్తున్న శృంగార జీవితానికి ఒక్కసారిగా దూరం కావడంతో ఈ విధమైన లక్షణాలు కనిపిస్తున్నాయని వారు చెప్పారు. రోజూ శృంగారానికి అలవాటు పడిన గుర్మీత్ సింగ్, అందులో పటుత్వానికి అవసరమైన ఔషధాలను ప్రత్యేకంగా ఆస్ట్రేలియా నుంచి తెప్పించుకునేవాడని అన్నారు. అలాగే గుర్మీత్ ఒకప్పుడు మద్యానికి బానిస అని వారు తెలిపారు. గతంలో మాంసాహారి అని అయితే ఇప్పుడు మద్యం, మాంసం మానేశాడని తెలిపారు. మానసిక రుగ్మతతో బాధపడుతున్న గుర్మీత్ బాబాకు చికిత్స చేయడంలో ఆలస్యం జరిగితే సమస్య మరింత పెరుగుతుందని వారు తెలిపారు. 

  • Loading...

More Telugu News