: యూనిఫాం ధరించలేదని బాలికను బాయ్స్ టాయిలెట్ లో నిలబెట్టిన టీచర్!
మైనర్ బాలికలపై జరుగుతున్న దాడులపై దేశవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. తాజాగా హైదరాబాదులోని ఓ స్కూల్ లో 11 ఏళ్ల బాలికకు విధించిన శిక్ష వింటే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే... దాని వివరాల్లోకి వెళ్తే, హైదరాబాదులోని ఒక ప్రైవేటు స్కూల్ కు చెందిన బాలిక యూనిఫాం వేసుకోకుండా, సివిల్ డ్రెస్ లో వెళ్లింది. దీనిని గమనించిన టీచర్ ఆమెను బాయ్స్ టాయిలెట్ లో నిలబెట్టింది.
తన యూనిఫాంను అమ్మ ఉతికిందని, అయితే అది ఇంకా ఆరకపోవడంతో సివిల్ డ్రెస్ వేసుకొని స్కూల్ కి వచ్చానని ఆ బాలిక చెప్పింది. తన స్కూల్ డైరీ లో ఈ విషయాలన్నీ అమ్మానాన్న రాశారని, అయినప్పటికీ టీచర్ తనను బాయ్స్ టాయిలెట్స్ లోకి తీసుకెళ్లి నిలబెట్టిందని ఆ బాలిక ఏడుస్తూ తెలిపింది. ఈ విషయం తెలుసుకున్న చైల్డ్ రైట్స్ యాక్టివిస్ట్స్ స్కూల్ పై కేసు నమోదు చేసి, సదరు టీచర్ ను వెంటనే ఉద్యోగంలో నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.