: శశికళ భర్త నటరాజన్‌కు తీవ్ర అనారోగ్యం.. పరిస్థితి విషమం
అన్నాడీఎంకే జనరల్ సెక్రటరీ వీకే శశికళ భర్త ఎం.నటరాజన్ (74) పరిస్థితి విషమంగా ఉంది. మల్టిపుల్ ఆర్గాన్ ఫెయిల్యూర్‌తో బాధపడుతున్న ఆయనను పెరుంబక్కమ్‌లోని గ్లెనీగ్‌లెస్ గ్లోబల్ హెల్త్ సిటీలో చేర్చారు. ప్రస్తుతం ఆయన ఇంటెన్సివ్ కేర్‌లో ఉన్నారు.
ఆసుపత్రి విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ప్రకారం.. నటరాజన్ తీవ్రమైన కాలేయ వ్యాధితో బాధపడుతున్నారు. గత ఆరు నెలలుగా చికిత్స కూడా తీసుకుంటున్నారు. ఈ వ్యాధితో కాలేయంతో పాటు కిడ్నీలు కూడా చెడిపోయాయి. ప్రస్తుతం ఆయనకు డయాలసిస్ అందిస్తున్నట్టు వైద్యులు తెలిపారు.
అవయవ మార్పిడి కోసం నటరాజన్ తమిళనాడు ఆర్గాన్ షేరింగ్ (టీఎన్ఓఎస్) వద్ద నమోదు చేసుకున్నారు. కాలేయ దాత కోసం ఎదురుచూస్తున్నారు. కాగా, ఆదివారం నటరాజన్‌కు 8 గంటలకు పైగా డయాలసిస్ నిర్వహించినట్టు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. నటరాజన్ ఈ ఏడాది ఫిబ్రవరి 5న శ్వాసకోశ సమస్యలతో అపోలో ఆసుపత్రిలో చేరారు.