: అద్నాన్‌ సామి ముద్దుల తనయపై ప్రధాని మోదీ వాత్సల్యం !


తన భార్య రోయా, కుమార్తె మెదీనాతో కలసి భారత ప్రధాని నరేంద్ర మోదీని కలిసిన విషయాన్ని ప్రముఖ గాయకుడు అద్నాన్ సామి చెప్పారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతా ద్వారా వరుస ట్వీట్లు చేశారు. రెండు రోజుల క్రితం మోదీని కలిశామని, సుమారు నలభై నిమిషాల పాటు ఆయనతో మాట్లాడానని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా తల్లి వద్ద ఉన్న చిన్నారి మెదీనా మృదువైన బుగ్గలను మోదీ ప్రేమగా స్పృశించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను అద్నాన్ సామి తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ప్రధాని మోదీ తమను ఎంతో ప్రేమగా ఆహ్వానించారని, తమ చిన్నారి మెలీనాకు ఆయన దీవెనలు అందజేశారని, ఈ క్షణాలను తాము మరువలేమని అద్నాన్ సామి తన ఇన్ స్టా గ్రామ్ ఖాతాలో పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News