: ప్రొఫెసర్ కంచె ఐలయ్యపై ఆర్యవైశ్యుల ఆగ్రహం.. దిష్టిబొమ్మ దహనం!
ప్రొఫెసర్ కంచె ఐలయ్య ఆర్యవైశ్య సామాజిక వర్గాన్ని అవమానించేలా నవల రాశారంటూ ఆ సామాజిక వర్గం వారు మండిపడుతున్నారు. హైదరాబాద్ లోని దిల్ సుఖ్ నగర్ చౌరస్తాలో కంచె ఐలయ్య దిష్టిబొమ్మను దహనం చేశారు. ఆర్య వైశ్య సామాజిక వర్గాన్ని కించపరిచేలా ‘సామాజిక స్మగ్లర్లు కోమటోళ్లు’ అనే నవల ఆయన రాయడం సబబు కాదని అన్నారు. అగ్రవర్ణాలను కించపరచడం ఐలయ్యకు అలవాటై పోయిందని, ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆర్య వైశ్యులు డిమాండ్ చేశారు.