: తెలుగు ఇండస్ట్రీ కాలర్ ఎగరేసుకునేంత గొప్పనటుడు ఆయన: దర్శకుడు బాబీ
తెలుగు ఇండస్ట్రీకి కాలర్ ఎగరేసుకునేంత గొప్పనటుడు జూనియర్ ఎన్టీఆర్ అని దర్శకుడు బాబీ ప్రశంసించారు. ‘జై లవ కుశ’ ప్రీ రిలీజ్ వేడుకలో ఆయన పాల్గొన్నారు. జూనియర్ ఎన్టీఆర్ అనే నటనా సముద్రం నుంచి తాను ట్యాంకర్ తో పట్టుకుపోతున్నానని దర్శకుడు సుకుమార్ అనడంపై ఆయన స్పందిస్తూ, తానేమీ ట్యాంకర్ తో పట్టుకుపోలేదని, ఇంకా టన్నుల టన్నులు ఆ సముద్రంలో ఉన్నాయని అనగానే చప్పట్లు మోగిపోయాయి. ఈ కథ చెప్పగానే జూనియర్ ఎన్టీఆర్ ఒప్పుకున్నారని, ఈ సందర్భంగా కోన వెంకట్ తనకు ఎంతో సహకరించారని అన్నారు. ఈ చిత్రం గురించి ఇంకా ఇంకా మాట్లాడుకునే రోజులు ముందున్నాయంటూ బాబీ చెప్పుకొచ్చారు.