: దర్శకుడు బాబీ ఏకంగా ట్యాంకర్ నీళ్లు పట్టుకుపోతున్నాడు: సుకుమార్ చమత్కారం
జూనియర్ ఎన్టీఆర్ ఓ నట సముద్రం అని, ఆ సముద్రంలో నుంచి ఒక చెంబు నీళ్లని తాను, ఓ బకెట్ నీళ్లని కొరటాల శివ తీసుకువెళ్లామని, దర్శకుడు బాబీ మాత్రం ఏకంగా ఓ ట్యాంకర్ నీళ్లు పట్టుకువెళుతున్నాడంటూ మరో ప్రముఖ దర్శకుడు సుకుమార్ చమత్కరించాడు.
‘జై లవ కుశ’ చిత్రం ప్రీ-రిలీజ్ వేడుకలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుకుమార్ మాట్లాడుతూ, ఈ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్ మూడు పాత్రలు పోషించడం అద్భుతమని, నట సముద్రం అని కితాబిచ్చారు. ‘రావణా జై జై జై ... శత్రు శాసనా జై జై జై..’ అనే పాటను ఆవిష్కరించిన సుకుమార్ మాట్లాడుతూ, ఈ పాట అద్భుతమని, రచయిత చంద్రబోస్ చాలా బాగా రాశాడని, దేవిశ్రీ సంగీతం సూపర్ అని ప్రశంసించారు. ‘నేను, దేవిశ్రీ ప్రసాద్, చంద్రబోస్..మా ముగ్గురి ఆత్మ లు ఒకటే. మేము ముగ్గురం కలిస్తే మైమరచి పోతాం’ అని సుకుమార్ అన్నారు.