: ఫెయిల్యూర్స్ లేని సూపర్ స్టార్ ఇంకా పుట్టలేదు: నటుడు సునీల్
‘ఫెయిల్యూర్స్ లేని సూపర్ స్టార్ ఇంకా పుట్టలేదు..పుట్టడు కూడా!’ అని ప్రముఖ హాస్య కథానాయకుడు సునీల్ అన్నాడు. ఓ ఇంటర్వ్యూలో సునీల్ మాట్లాడుతూ, ‘ఫెయిల్యూర్ లేని యాక్టర్ లేడు..ఇంకా పుట్టడు కూడా’ అని అన్నాడు. హాస్యనటుడి నుంచి హీరోగా మారినా కూడా ప్రేక్షకులు మిమ్మల్ని కమెడియన్ గానే చూస్తున్నారనే ప్రశ్నకు సునీల్ స్పందిస్తూ, ‘మీ ఇంట్లో రోజూ వంకాయకూర చేస్తే తింటారా? తినరు. అలాగే, నేను హాస్య పాత్రలు చేస్తూ పోతే ఏమనే వారో! ‘రొటీన్ అయిపోయింది’ అని అంటారేమో. నేను నాలుగు వందల సినిమాల్లో చేశా..ఇంకా, కామెడీ పాత్రలే చేస్తే ’బోర్ కొట్టేస్తోందని’ అంటారేమో!. నాతో స్టార్ హీరోయిన్లు నటించకపోవడం అనేది కేవలం వారి వ్యక్తిగతం’ అని సునీల్ చెప్పుకొచ్చాడు.