: కమలహాసన్ ను 'ఇడియట్' అంటూ సుబ్రహ్మణ్యస్వామి తీవ్ర వ్యాఖ్యలు!
త్వరలో రాజకీయాల్లోకి వస్తానంటూ ప్రకటించిన విలక్షణ నటుడు కమలహాసన్ పై బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్య స్వామి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘ఇతరుల కంటే తాను ఎంతో గొప్ప వ్యక్తిని అని భావించుకునే ఇడియట్ కమలహాసన్ సీపీఎంలో చేరుతున్నట్టు విన్నాను!’ అంటూ ట్విట్టర్ ద్వారా సుబ్రహ్మణ్యస్వామి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
కాగా, ఈ వ్యాఖ్యలపై నెటిజన్లు భిన్నంగా స్పందించారు. ‘ఇతర పార్టీల్లో నుంచి బీజేపీలో చేరిన చాలామంది ఇడియట్స్ ప్రస్తుతం ఆ పార్టీలో ఉన్నారు. అందరూ సమర్థతగల ఇడియట్స్’, ‘స్టాలిన్ ను బహిరంగంగా ఆరాధించడం కమల్ ఇప్పుడే మొదలుపెట్టాడు!’,‘ ఆయన ఇష్టం ఏ పార్టీలో అయినా సరే చేరవచ్చు. మీరెందుకు బాధపడుతున్నారు బ్రోకర్ స్వామి?’, ‘కమలహాసన్ పేరెత్తే అర్హత కూడా నీకు లేదు’ అంటూ రకరకాలుగా మండిపడ్డారు.