: మెగాస్టార్ చిరంజీవి పక్కన నటించాలని ఉంది: హాస్యనటుడు ‘హైపర్’ ఆది
మెగాస్టార్ చిరంజీవి పక్కన నటించాలనేది తన చిరకాల కోరిక అని ‘జబర్దస్త్’ స్క్రిప్ట్ రచయిత, నటుడు ‘హైపర్’ అలీ అన్నాడు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, ‘చిరంజీవి గారంటే నాకు ఎంతో ఇష్టం. ఆయన నటించిన విజేత సినిమా అంటే చాలా ఇష్టం.. ముప్పై, నలభై సార్లు చూసుంటాను. సైరా నరసింహారెడ్డి వంటి చిత్రంలో ఆయన పక్కన స్క్రీన్ షేర్ చేసుకుంటే కనుక నా ఆనందానికి అవధులు వుండవు!’ అన్నాడు.
‘ఏదైనా సినిమాలో నాకో అవకాశం ఇవ్వండి అని అడగడం వేరు, వాళ్లంతట వాళ్లు పిలిచి నటించమంటే వచ్చే సంతృప్తి వేరు’ అని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పాడు. కమెడియన్లలో ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం అంటే తనకు చాలా ఇష్టమని చెప్పాడు. ‘జబర్దస్త్’ స్క్రిప్ట్ కు తాను మొదట తీసుకున్నది మూడు వేల రూపాయలని, ఆ తర్వాత క్రమక్రమంగా ఎదిగానని చెప్పాడు. ‘మూడు వేల రూపాయలతో మొదలైన మీ పారితోషికం, ఆ తర్వాత మూడు పక్కన ఎన్ని ‘సున్న’ల వరకు చేరింది?’ అని ప్రశ్నించగా, ‘అవి చెప్పే ‘సున్న’లు కాదని’ అంటూ హైపర్ ఆది చిరునవ్వులు చిందించాడు. కాగా,‘అల్లరి’ నరేష్ తో కలిసి హైపర్ ఆది నటించిన చిత్రం ‘మేడమీద అబ్బాయి’.