: జగన్ పై మంత్రి ఆదినారాయణరెడ్డి వ్యంగ్యాస్త్రాలు!
ఏపీ ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై రాష్ట్ర మంత్రి ఆదినారాయణరెడ్డి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. జగన్ దైవాంశసంభూతుడంటూ సెటైర్లు వేశారు. కడపలోని వైఎస్ ఆడిటోరియంలో టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో ‘ఇంటింటికీ టీడీపీ’ కార్యక్రమంపై ఈ రోజు చర్చ జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, పులివెందుల నియోజకవర్గం సహా అన్ని నియోజకవర్గాలను అభివృద్ధి చేస్తామని, అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందిస్తామని చెప్పారు. బద్వేలు ఎమ్మెల్యేను వైసీపీ నేతలు బెదిరించారని ఈ సందర్భంగా ఆదినారాయణరెడ్డి ఆరోపించారు.