: డిప్రెషన్ తో బెంగళూరుకు చెందిన యువ మ్యూజీషియన్‌ ఆత్మహత్య


డిప్రెషన్ తో ఓ యువ మ్యూజీషియన్‌ ఆత్మహత్యకు పాల్పడిన విషాద సంఘటన ముంబైలో జరిగింది. బెంగళూరుకు చెందిన మ్యూజీషియన్‌ కరణ్ జోసెఫ్ అవకాశాల నిమిత్తం ముంబై వెళ్లాడు. సుమారు నెల రోజులుగా బాంద్రాలోని తన స్నేహితుడి ఇంట్లో ఉంటున్నాడు. నిన్న రాత్రి తన స్నేహితులతో కలిసి ఫ్లాట్ లో టీవీ చూస్తున్న కరణ్, ఉన్నట్టుండి 12 వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే, ఈ సంఘటనకు పాల్పడిన సమయంలో కరణ్ మద్యం మత్తులో ఉన్నట్టు అతని మిత్రులు తెలిపారు. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కరణ్ మొబైల్ ను ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించామని, అవకాశాల కోసం ముంబై వెళ్లిన కరణ్ డిప్రెషన్ తో బాధపడుతున్నట్టు తమ దర్యాప్తులో తెలిసిందని చెప్పారు.  

  • Loading...

More Telugu News