: పుండు మీద కారం... ఇర్మా వెంటే వస్తున్న 'జోస్'!


ఇప్పటికింకా పెను తుపాను ఇర్మా భయం తొలగనే లేదు. దాని వెంటే పుండు మీద కారం చల్లుతున్నట్టు మరో తుపాను 'జోస్' భీకరంగా మారి తీరంవైపు దూసుకొస్తూ తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. కరేబియన్ దీవి బార్బుడాను వణికించి, నామరూపాల్లేకుండా చేసిన ఇర్మా వెళ్లిపోయిన నాలుగు రోజుల వ్యవధిలోనే 'జోస్' బయలుదేరింది. కేటగిరీ 4 హెచ్చరికలతో వస్తున్న జోస్, బార్బుడాపై మాత్రం కాస్తంత కరుణ చూపుతూ, మిగతా దీవులపై భారీ వర్షాలతో కరేబియన్ దీవులపై విరుచుకుపడింది. జోస్ మరో మూడు నాలుగు రోజుల తరువాత అమెరికా తీరాన్ని తాకవచ్చని అంచనా. దీంతో అమెరికా మరింత ఆందోళన చెందుతోంది.

  • Loading...

More Telugu News