: ఆమె సరిగ్గా తెలియనే తెలియదు... నాతో లింకేంటి?: పరిణీతి చోప్రాపై హార్దిక్ పాండ్యా


తాను చేసిన ఓ అనవసరపు ట్వీట్ తో ఇరుకున పడ్డ హార్దిక్ పాండ్యా, హీరోయిన పరిణీతి చోప్రాతో అంటగట్టిన ఎఫైర్ పై స్పందించాడు. పరిణీతి గురించి తనకు తెలియనే తెలియదని, ఆమెతో తాను సరిగ్గా మాట్లాడింది కూడా లేదని, తాను శ్రీలంకలో ఉన్న సమయంలో ఈ ట్వీట్ గొడవ నడిచిందని వివరణ ఇచ్చాడు. తనకు ఎవరితో ఎఫైర్ అంటగట్టినా లెక్కచేయబోనని, ఈ విషయంలో చెప్పేందుకు ఇంకేమీ లేదని ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. కాగా, పరిణీతి ట్వీట్ కు పాండ్యా కామెంట్ పెట్టడంతో, ఆటపై దృష్టిని పెట్టి అమ్మాయిల వెంట పడటం మానేయాలని నెటిజన్లు విమర్శించిన సంగతి తెలిసిందే. ఆపై వీరిద్దరూ ప్రేమించుకుంటున్నారన్న వార్తలు గుప్పుమన్నాయి. ఈ వదంతులపై ఇటీవలే పరిణీతి కూడా వివరణ ఇచ్చిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News