: ఇర్మా దెబ్బకు అదృశ్యమైన అట్లాంటిక్ మహా సముద్రం!


ఇర్మా తుపాను బీభత్సానికి కరేబియన్ దీవులను చుట్టుముట్టి ఉండే అందమైన అట్లాంటిక్ మహా సముద్రం కనుచూపు మేరలో మాయమైంది. దాదాపు 700కు పైగా ద్వీపాలు, ఎన్నో బీచ్ లు, రిసార్టులు, పర్యాటకుల సందడితో ఉండే బహమాస్ కకావికలం కాగా, దీవుల చుట్టూ ఉన్న సముద్రం మాయమైన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. తుపాను సుడులు సముద్రం నీటిని లోపలకు లాక్కున్నాయని తెలుస్తోంది. ఆపై 13 గంటల తరువాత, తిరిగి నీరు చేరుకుంది. ఓ బహమాస్ నివాసి సముద్రం మాయమైన వీడియోను, ఫోటోలను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశాడు.

  • Loading...

More Telugu News