: 'ఇర్మా'తో సెల్ఫీ దిగి, బొక్క బోర్లా పడి..!


ఓ వైపు నుంచి పెను ప్రమాదం ఇర్మా తుపాను రూపంలో దూసుకు వస్తోందని, ప్రజలు తీర ప్రాంతానికి సాధ్యమైనంత దూరంగా వెళ్లిపోవాలని అధికారులు నెత్తీ నోరూ మొత్తుకుని చెబుతున్నా, కొందరు మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తూ ప్రాణాలపైకి తెచ్చుకుంటున్నారు. ఫ్లోరిడాకు దక్షిణంగా సముద్రంలో విహరిస్తున్న ఓ జంట, ఇర్మా ప్రభావంతో పది అడుగులకు పైగా ఎత్తులో వస్తున్న అలలకు ఎదురుగా నిలబడి సెల్ఫీ దిగేందుకు ప్రయత్నించింది. ఉద్ధృతంగా వచ్చిన అల అతన్ని బలంగా తాకగా, బొక్క బోర్లా పడ్డాడు. అలల బలం అప్పటికి తెలిసొచ్చిందో ఏమో.. వెంటనే లేచి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఈ ప్రాంతంలో ప్రభుత్వ హెచ్చరికలను చాలా మంది పట్టించుకోకుండా అక్కడే ఉండిపోయినట్టు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News