: మావోయిస్టులకు సింహస్వప్నంగా నిలిచిన వర్ధన్నపేట ఏసీపీ స్వైన్ ఫ్లూతో కన్నుమూత!
వర్థన్నపేట ఏసీపీ దుర్గయ్య యాదవ్ ఈ ఉదయం స్వైన్ ఫ్లూతో మరణించారు. 1991వ బ్యాచ్ కు చెందిన దుర్గయ్య గత కొంత కాలంగా తీవ్రమైన జలుబు, దగ్గు, జ్వరంతో బాధపడుతుండగా, ఆయనకు స్వైన్ ఫ్లూ సోకిందని నిర్ధారించిన అధికారులు చికిత్స చేస్తున్నారు. హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన, శరీరంలో వైరస్ ఎక్కువై ఆయన ప్రాణాలు విడిచారని వైద్యులు వెల్లడించారు. వర్ధన్నపేట ప్రాంతంలో అధికంగా ఉండే మావోయిస్టులపై ఉక్కుపాదం మోపి, డిపార్టుమెంట్ లో సమర్థవంతుడైన అధికారిగా పేరు తెచ్చుకున్న దుర్గయ్యను హత్య చేయాలని భావించిన మావోలు ఓ దఫా ప్రయత్నించి విఫలయ్యారు కూడా. దుర్గయ్య మృతిపై పోలీసు ఉన్నతాధికారులు సంతాపాన్ని వెలిబుచ్చారు.