: కెనడాలో సిక్కు రాజకీయ నాయకుడికి వేదికపైనే జాతి వివక్ష... ఎంత సమర్థవంతంగా ఎదుర్కొన్నాడో మీరే చూడండి!


కెనడాలో న్యూ డెమొక్రటిక్ పార్టీ నేత జగ్మీత్ సింగ్ ఓ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగిస్తున్న సమయంలో, వేదికపైకి దూసుకొచ్చిన ఓ యువతి అతనిపై జాతి వివక్షను చూపుతూ పెద్దగా అరుస్తూ తన నిరసనలు తెలియజేస్తుంటే, అత్యంత చాకచక్యంగా ఆమెను నిలువరించిన జగ్మీత్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. లేక్ రిక్రియేషన్ సెంటర్ లో 'జగ్ మీట్ అండ్ గ్రీట్' పేరిట ఓ కార్యక్రమం ఏర్పాటు కాగా, అక్కడీ ఘటన జరిగింది.

వేదికపైకి వచ్చిన ఓ యువతి, జగ్మీత్ ను ముస్లింగా అభివర్ణిస్తూ, తిడుతుండగా, ఆమెను అడ్డుకోబోయిన నిర్వాహకులపై విరుచుకుపడింది. తనను తాకవద్దని, తాకితే పోలీసులకు ఫిర్యాదు చేస్తానని హెచ్చరించింది. ఆమెను తనదైన శైలిలో నిలువరించిన జగ్మీత్ వీడియోను మీరూ చూడవచ్చు.

  • Loading...

More Telugu News