: కొచ్చిలో వినూత్న ఆఫర్... 'మందు' కొంటే చీర ఉచితం!
కేరళలోని కొచ్చిలో ఓ లిక్కర్ షాపు వింతైన ఆఫర్ ఇస్తూ, తయారు చేసిన ఓ టీవీ ప్రకటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. షీవాజ్ రీగల్ విస్కీ బాటిల్ కొనుగోలు చేస్తే ఖరీదైన చీరను ఉచితంగా ఇస్తామని ఆ ప్రకటన చెబుతోంది. ఈ విస్కీ బాటిల్ ఖరీదు 100 డాలర్ల వరకూ ఉంటుంది. అంటే సుమారు రూ. 6,600 అన్నమాట.
దీంతో ఇది కొనుగోలు చేసిన వారికి కేరళ సంప్రదాయ చీరను గిఫ్ట్ గా ఇస్తున్నారు. ఈ ఓనమ్ సీజన్ లో మాత్రమే ఈ ఆఫర్ ఉంటుందని చెబుతున్నారు. లిక్కర్ ఫారిన్ ది అయితే, ఐడియా ఇండియాదని అనుకుంటూ మందుబాబులు ఆ షాపుకు క్యూ కడుతున్నారు. ఇంట్లో ఆడవాళ్లను మచ్చిక చేసుకోవచ్చని ఈ యాడ్ ను చూసిన వాళ్లు జోకుల మీద జోకులు వేసుకుంటున్నారు.