: షీనాబోరా హత్యకేసు: వీడియో కాల్ ద్వారా ఇంద్రాణి, నేను కలిసి హత్యకు ప్లాన్ చేశాం.. గుట్టువిప్పిన డ్రైవర్


షీనా బోరా హత్యకేసులో అప్రూవర్‌గా మారిన ఇంద్రాణి ముఖర్జియా కారు డ్రైవర్ శ్యామ్‌వర్ రాయ్ కోర్టు విచారణలో కీలక విషయాలు వెల్లడించాడు. శనివారం షీనాబోరా సోదరుడు మిఖాయిల్, ఆమె బాయ్‌ఫ్రెండ్ రాహుల్ ముఖర్జియా‌లతో నిర్వహించిన క్రాస్ ఎగ్జామినేషనల్‌లో శ్యామ్‌వర్ రాయ్ పలు కీలక విషయాల గురించి నోరు విప్పాడు.

షీనా బోరా హత్యకు ముందు ఇంద్రాణియా, తాను స్కైప్ ద్వారా వీడియో కాల్ ద్వారా మాట్లాడుకున్నట్టు తెలిపాడు. అప్పుడే షీనా హత్యకు పథక రచన చేసినట్టు చెప్పాడు. స్కైప్ ద్వారా ఆమెతో నాలుగైదు సార్లు మాట్లాడినట్టు తెలిపాడు. ఇందుకోసం తాను రూ.1.25 లక్షలు తీసుకున్నట్టు తీసుకున్నట్టు వెల్లడించాడు. షీనాను చంపడం తప్పని అనిపించలేదా? అన్న కోర్టు ప్రశ్నకు రాయ్ స్పందిస్తూ తనకు తప్పనే అనిపించిందని, అయితే ఇంద్రాణి మేడమ్ మాత్రం ‘‘నువ్వు డ్రైవర్‌వి మాత్రమే.. నేను చెప్పినట్టు చెయ్యి’’ అని అన్నారని వివరించాడు.

  • Loading...

More Telugu News