: ఇప్పుడు మొబైల్ వినియోగదారుల వంతు.. ఆధార్-సిమ్‌కార్డు లింక్ చేయకుంటే కనెక్షన్ కట్!


సంక్షేమ పథకాలకు, బ్యాంక్ ఖాతాలకు, పాన్ కార్డులకు ఆధార్ లింక్ అయిపోయింది.. ఇప్పుడు మొబైల్ వినియోగదారుల వంతు వచ్చింది. తమ సిమ్ నంబరుతో ఆధార్‌ను అనుసంధానం చేయకుంటే ఇక మొబైల్ సేవలు నిలిచిపోనున్నాయి. ఆధార్-సిమ్ అనుసంధానానికి ప్రభుత్వం వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు గడువు ఇచ్చింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు ప్రభుత్వం ఈ లింకింగ్‌ను మరింత వేగవంతం చేయాలని నిర్ణయించింది. అన్ని  సిమ్‌కార్డులను ఆధార్ నంబరుతో నిజనిర్ధారణ చేసుకోవాలని, ఆధార్ నంబరుతో అనుసంధానం కాని సిమ్‌లను ఫిబ్రవరి 2018 తర్వాత డీయాక్టివేట్ చేయాలని కోర్టు తన ఆదేశాల్లో పేర్కొంది. ఎన్జీవో లోక్‌నీతి ఫౌండేషన్ వేసిన పిల్‌ను విచారించిన కోర్టు అప్పట్లో ఈ ఆదేశాలు జారీ చేసింది.

కోర్టు ఆదేశాలపై స్పందించిన అప్పటి అటార్నీ జనరల్ మాట్లాడుతూ 105 కోట్ల మంది మొబైల్ వినియోగదారులు ఉండడంతో దీనికి కొంత సమయం పడుతుందని కోర్టుకు తెలిపారు. మొత్తం యూజర్లలో 90 శాతం మంది ప్రీ-పెయిడ్ యూజర్లు ఉన్నట్టు పేర్కొన్నారు. దీంతో కోర్టు ఏడాది సమయం ఇచ్చింది. కాగా, ఆధార్-సిమ్ అనుసంధానం వల్ల మోసపూరిత సమాచారం, మిస్‌యూజ్‌ను తగ్గించవచ్చని కేంద్రం యోచిస్తోంది.

  • Loading...

More Telugu News