: రికార్డులు బద్దలుగొట్టిన ప్రిన్స్ చార్లెస్.. సుదీర్ఘ కాలం పాలించిన రాజుగా చరిత్ర పుటల్లోకి!


సుదీర్ఘ కాలంపాటు ప్రిన్స్ ఆఫ్ వేల్స్‌‌గా ఉన్న తొలి రాజుగా ప్రిన్స్ చార్లెస్ రికార్డు సృష్టించారు. ఈ క్రమంలో క్వీన్ విక్టోరియా పెద్ద కుమారుడు అల్బెర్ట్ పేరిట ఉన్న రికార్డు బద్దలైంది. అల్బెర్ట్ 59 ఏళ్లు రాజుగా కొనసాగగా ప్రస్తుత రాజు ప్రిన్స్ చార్లెస్ 59 ఏళ్ల ఒక నెలా 15 రోజులతో ఆ రికార్డును అధిగమించారు. ప్రిన్స్ చార్లెస్ 9 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు జూలై 26, 1958లో ప్రిన్స్ ఆఫ్ వేల్స్‌గా నియమితులయ్యారు. ఈ నవంబరులో ఆయన 69వ ఏట అడుగిడనున్నారు. ప్రస్తుతం చార్లెస్ 21వ ప్రిన్స్ ఆఫ్ వేల్స్.

  • Loading...

More Telugu News